బుధవారం 03 జూన్ 2020
International - May 23, 2020 , 20:06:30

పొరపాటున ట్రంప్‌ బ్యాంకు సమాచారం వెల్లడించిన వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి

పొరపాటున ట్రంప్‌ బ్యాంకు సమాచారం వెల్లడించిన వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి

వాషింగ్టన్‌: వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి చేసిన ఒక పొరపాటు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ (HHS) విభాగానికి తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించి శుక్రవారం ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కైలీ మెక్‌ ఎనానీ.. అధ్యక్షుడు ట్రంప్‌ HHS విభాగానికి మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 

అనంతరం ఆమె ఒక చెక్‌ను మీడియాకు చూపించారు. ఇక్కడే ఆమె పొరపాటు చేశారు. ట్రంప్‌ మూడు నెలల వేతనానికి సంబంధించిన చెక్‌ను కాకుండా, లక్ష అమెరికన్‌ డాలర్ల నగదు రాసి ఉన్న మరో చెక్‌ను చూపించారు. అందులో అధ్యక్షుడి పేరు, సంతకం మాత్రమే కాకుండా ట్రంప్‌ చిరునామాతోపాటు పూర్తి వివరాలు ఉన్నాయి. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. అధ్యక్షుడి ప్రైవేటు బ్యాంకు సమాచారం బయటకు పొక్కడం అంత మంచిది కాదని పలువురు విమర్శిస్తున్నారు. 

కాగా, వైట్‌హౌస్‌ అధికారులు మాత్రం మీడియా ప్రతినిధులు ట్రంప్‌ ఇచ్చిన విరాళం గురించి కాకుండా కైలీ పొరపాటు గురించి ఎక్కువగా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కైలీ చేసింది చిన్నపొరపాటు మాత్రమేనని, దానికి ఇంత చర్చ అవసరం లేదని పేర్కొన్నారు. logo