గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 10:21:55

క‌రోనా టాస్క్ ఫోర్స్‌ను మార్చ‌నున్న ట్రంప్‌..

క‌రోనా టాస్క్ ఫోర్స్‌ను మార్చ‌నున్న ట్రంప్‌..


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌ను నిర్వీర్యం చేయ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రానున్న కొన్ని వారాల్లో ఈ ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ కూడా స్ప‌ష్టం చేశారు. ఆరిజోనాలో మాస్క్ ఉత్ప‌త్తి చేసే ఫ్యాక్ట‌రీని ట్రంప్ సంద‌ర్శించారు. అక్క‌డ ఆయ‌న మాట్లాడుతూ  దేశం మ‌ళ్లీ గాడిలో ప‌డ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్‌తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది బాగా ప‌నిచేసింద‌ని, అయితే త్వ‌ర‌లోనే ఆ సెట‌ప్‌ను మార్చ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అమెరికాలో స‌గ‌టున ప్ర‌తి రోజు 20వేల ఇన్‌ఫెక్ష‌న్లు న‌మోదు అవుతున్నాయి. ప్ర‌స్తుతం రోజు మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య కూడా వెయ్యి దాటుతున్న‌ది. ఒక‌వేళ దేశ‌వ్యాప్తంగా వ్యాపారాలు ప్రారంభం అయితే అప్పుడు మ‌ళ్లీ వైర‌స్ కేసులు పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అమెరికాలో మొత్తం 12 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. దాదాపు 70 వేల మంది మ‌ర‌ణించిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది.logo