గురువారం 04 జూన్ 2020
International - Apr 30, 2020 , 14:00:28

ట్విట్ట‌ర్ అక్కౌంట్స్‌ అన్‌ఫాలోపై వైట్‌హౌస్ వివ‌ర‌ణ‌

ట్విట్ట‌ర్ అక్కౌంట్స్‌ అన్‌ఫాలోపై వైట్‌హౌస్ వివ‌ర‌ణ‌

వాషింగ్టన్‌: భారత రాష్ట్ర‌ప‌తి, ప్రధాని మోదీని... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో అన్‌ఫాలో చేసిన విషయంపై వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.  భార‌త్‌కు సంబంధించిన‌ ట్విట్ట‌ర్ ఖాతాల‌ను నిన్న అన్‌ఫాలో చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పలు రకాల వాదనలు వినిపిస్తోన్న నేపథ్యంలో  వైట్ హౌస్ అధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు. వాస్త‌వానికి కొన్ని రోజుల క్రితం వరకు వైట్‌ హౌస్‌ ట్విట్టర్‌ ఖాతా మొత్తం 19 మంది ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతుండగా అందులో 14 మంది అమెరికన్లే ఉండేవారు. మిగతా ఐదు ఖాతాలు మ‌న దేశానికి సంబంధించినవే ఉండేవి. అయితే అమెరికా అధ్యక్షుని పర్యటన సందర్భంగా ట్విట్టర్‌‌ అకౌంట్లను ఫాలో అవుతామని... ఆ తర్వాత కొన్ని రోజులకు అన్‌ఫాలో చేస్తామని వైట్‌హౌస్‌లోని అధికారులు పేర్కొన్నారు. పర్యటనకు మద్దతుగా.. వారి ట్వీట్స్‌ను రీ ట్వీట్‌ చేసేందుక కొద్ది కాలం పాటు మాత్రమే అకౌంట్లను ఫాలో అవుతున్నట్లు చెప్పారు. 


logo