మంగళవారం 26 జనవరి 2021
International - Dec 02, 2020 , 21:35:40

పాకిస్తాన్‌కు శరాఘాతం : నౌకాదళ విన్యాసాలు రద్దు

పాకిస్తాన్‌కు శరాఘాతం : నౌకాదళ విన్యాసాలు రద్దు

ఇస్లామాబాద్‌: నౌకాదళ విన్యాసాలు రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా మహమ్మారిని బూచిచీగా చూపి పలు దేశాలు పాకిస్తాన్‌ చేపట్టే నావికాదళ విన్యాసాల్లో పాల్గొనలేమని స్పష్టం చేశాయి. దాంతో మరోసారి నావికాదళ విన్యాసాలు చేపట్టేందుకు ప్రస్తుత విన్యాసాలను వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఇటీవల భారత్‌ నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు విజయవంతం కావడంతో పాకిస్తాన్‌ కూడా తమ మిత్ర దేశాలతో ఇదేమాదిరి విన్యాసాలు చేపట్టాలని నిర్ణయించింది. భారత్‌ నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో అమెరికాతోపాటు జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొన్నాయి. అంతకుముందు నిర్వహించిన విన్యాసాల్లో రష్యా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు హాజరయ్యాయి. భారత్‌ మాదిరిగా పాకిస్తాన్‌లో కూడా నౌకాదళ విన్యాసాలు చేపట్టి ప్రపంచం దృష్టని ఆకర్శించాలని పలుదేశాలను ఆహ్వానం పలుకగా.. కరోనా మహమ్మారిని బూచీగా చూపిన ఆయా దేశాలు విన్యాసాల్లో పాల్గొనలేమని తేల్చిచెప్పాయి.

అలాగే, తూర్పు, ఆగ్నేయ ఆసియాకు పీఎన్‌ఎస్ సైఫ్, గైడెడ్ క్షిపణి యుద్ధనౌక, చైనా నిర్మించిన రీప్లేనిష్మెంట్ ట్యాంకర్ పీఎన్‌ఎస్ నాస్ర్ రద్దు చేయబడింది. 70 రోజుల పర్యటనలో వియత్నాంలోని న్హా ట్రాంగ్, చైనాలోని గ్వాంగ్‌జౌ, ఫిలిప్పీన్స్‌లోని మనీలా, మేలో బ్రూనైలోని ముయారా సందర్శనలు ఉన్నాయి. ఆపై సైఫ్ మలేషియాలోని లుముట్, నాస్ర్, ఇండోనేషియాలోని బెలావాన్‌కు వెళ్తారు. ఆరు దేశాల పర్యటన మొత్తం ఇప్పుడు రద్దు చేయబడింది. అదేవిధంగా, ఇంధనం, లాజిస్టిక్స్ కోసం ఓడలను తన ఓడరేవుల్లోకి మాత్రమే అనుమతించవచ్చని  పాకిస్తాన్‌కు ఓమన్‌ తెలిపింది. ఓడ నుంచి ఎవరినీ అనుమతించరని, దౌత్య సందర్శనలు ఉండవని స్పష్టం చేసింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo