మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 16:15:28

కరోనా వైరస్‌ సోకని దేశాలివే..!

కరోనా వైరస్‌ సోకని దేశాలివే..!

న్యూఢిల్లీ:  చైనాలోని వుహాన్ నగరంలో మొదటగా(డిసెంబర్‌ 2019) వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ అతి తక్కువ  సమయంలోనే  ప్రపంచ  దేశాలకు వ్యాపించింది.  అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, రష్యా దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది. కరోనా మహమ్మారి దెబ్బకు 190కు పైగా దేశాలు వణికిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 188 దేశాలకు వైరస్‌ విస్తరించింది. 

ఇప్పటికీ కొన్ని దేశాల్లోకి కరోనా అడుగుపెట్టలేదు.  కనీసం ఒక్క కేసు కూడా ఈ దేశాల్లో  నమోదు కాలేదు. వీటిలో చాలా వరకు చిన్న దేశాలు(ద్వీపాలు) కావడం, విదేశీ రాకపోకలు లేకపోవడం వల్ల కరోనా దరిచేరలేదు.  చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలో కోవిడ్‌-19 కేసులు నమోదైనట్లు వార్తలు బయటకి రాకపోవడం గమనార్హం. 

ఆ దేశాలు ఇవే..

కిరిబతి 

మార్షల్‌ ఐలాండ్స్‌

 మైక్రోనేషియా

 నౌరు

 ఉత్తర కొరియా

 పలావు

 సమోవ

 సాల్మన్‌ ఐలాండ్స్‌

 టోంగా

 తుర్క్‌మెనిస్థాన్‌

 తువాలు

 వనాటు

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo