శుక్రవారం 05 జూన్ 2020
International - May 09, 2020 , 20:19:23

ఎలుగుబంటి హెల్పింగ్ నేచర్.. నెటిజన్లు ఫిదా!

ఎలుగుబంటి హెల్పింగ్ నేచర్.. నెటిజన్లు ఫిదా!

తెలివితేట‌ల్లో మ‌నిషికి మించిన ప్రాణి లేదంటారు. రోడ్లు మీద న‌డిచేట‌ప్పుడు చిన్న ముళ్లు క‌నిపించినా నాకెందుకులే నేను తొక్క‌లేదు క‌దా అని వెళ్లిపోతారు. ఇదీ.. స‌మాజానికి మ‌నిషి చేసే మేలు. ఈ ఎలుగుబంటిని చూడండి మాన‌వ‌త్వం ఏంటో గుర్తుకువ‌స్తుంది. రోడ్డుమీద ఒంట‌రిగా వెళ్తున్న ఈ ఎలుగుబంటికి ఒక పోల్ ప‌డిపోయి ఉండ‌డం క‌నిపించింది. నాకు ఎందుకులే ఇవి మ‌నుషుల‌కి సంబంధించిన‌ది క‌దా అని ఊరుకోలేదు. దాన్ని చేతులైన రెండు కాళ్ల‌తో ఎత్తిపెట్టింది. ఇక త‌న దారేదో త‌ను చూసుకున్న‌ది. ఈ వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.


logo