మంగళవారం 26 మే 2020
International - May 23, 2020 , 16:16:14

కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సప్‌.. క్యూఆర్‌ కోడ్‌తో నెం. సేవ్‌!

కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సప్‌.. క్యూఆర్‌ కోడ్‌తో నెం. సేవ్‌!

కాంటాక్ట్‌ నెంబర్‌ ఫీడ్‌ చేయాలంటే కీప్యాడ్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత నెంబర్‌ టైప్‌ చేసి, పేరు కూడా టైప్‌ చేయాలి. ఇప్పుడు సేవ్‌ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో ఒక్కోసారి నెంబర్‌ తప్పు పడడం జరుగుతుంది. ఇలా ఒక నెంబర్‌ అయితే ఫీడ్‌ చేసుకోవచ్చు. చాలా నెంబర్లు చేయాలంటే ఒకరోజుతో అయ్యే పనికాదు. ఇప్పుడిక అంత కష్టపడనవసరం లేదు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరి.

ఈ ఆప్షన్‌ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ప్రతి ఒకరి వాట్సాప్‌కు ఒక క్యూఆర్‌ కోడ్‌ను కేటాయించనున్నది వాట్సాప్‌ యాజమాన్యం. ఎవరి నెంబర్‌ అయితే ఫీడ్‌ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఫోన్‌లోని క్యూఆర్‌ కోడ్‌ను మీ ఫోన్‌తో స్కాన్‌ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్ల ముందుకు తీసుకురానున్నట్లు వాట్సప్‌ ప్రకటించినది. 


logo