మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jul 06, 2020 , 17:07:33

చైనా జిన్జియాంగ్‌లో ఏం జరుగుతోంది?

చైనా జిన్జియాంగ్‌లో ఏం జరుగుతోంది?

బీజింగ్: చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడి ముస్లిం మైనార్టీలైన ఉయ్ఘర్లను చైనా దారుణంగా అణచివేస్తుండటమే దీనికి ప్రధాన కారణం. చైనా పశ్చిమ జిన్జియాంగ్‌లో సుమారు 11 లక్షల మంది ఉయ్ఘర్లు ఉంటారు. టర్కిష్‌తో దగ్గరి సంబంధం ఉన్న భాషను వారు మాట్లాడతారు. వారికి సొంత సంస్కృతి ఉన్నది. స్వయంప్రతిపత్తి, స్వపరిపాలన వారికి ఉన్నాయి.

కాగా, జిన్జియాంగ్ భౌగోళికంగా చైనాకు వ్యూహాత్మకమైనది. ఇది మధ్య ఆసియాకు ప్రవేశ ద్వారం. కజాఖిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులతో పాటు ఉత్తరాన మంగోలియా, రష్యా దక్షిణాన పాకిస్థాన్, భారతదేశం ఉన్నాయి. కాగా, సహజ వనరులకు నిలయమైన  జిన్జియాంగ్ ప్రాంతంపై చైనా కన్ను పడింది. దీంతో ఆర్థిక అభివృద్ధి పేరుతో గత కొన్నేండ్లుగా అక్కడి మైనార్టీ ముస్లింల హక్కులను హరించి వేస్తున్నది.

అక్కడ భారీగా నిర్బంధ శిబిరాలను చైనా నిర్మించింది. ముస్లిం మైనార్టీలైన ఉయ్ఘర్లను ఈ ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నది. చైనా సంస్కృతి, భాషపై శిక్షణ పేరుతో వారిపై వేధింపులకు పాల్పడుతున్నది. వారితో కఠిన పనులు చేయించడంతోపాటు శారీరక, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నది. చాలా మందిని చిత్ర హింసలుపెట్టి దారుణంగా చంపేస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఉయ్ఘర్ జాతి మైనారిటీని అణచివేస్తున్న చైనాకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంతకం చేశారు. కాగా, చైనా చర్యను గతంలో సమర్ధించిన ట్రంప్ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.logo