మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 13:52:05

బాయ్‌కాట్ 'ములాన్'.. హాంకాంగ్‌లో ఆందోళ‌న‌లు!

బాయ్‌కాట్ 'ములాన్'.. హాంకాంగ్‌లో ఆందోళ‌న‌లు!

న్యూఢిల్లి: ములాన్‌! ఇది డిస్నీ సంస్థ నిర్మించిన ఒక చిత్రం పేరు. ఈ చిత్రంలో ముఖ్య‌మైన‌ ములాన్‌ పాత్రను చైనా సంత‌తికి చెందిన అమెరికా న‌టి లియూ ఈఫే పోషించారు. ఈ చిత్రం విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. చైనా ఆధీనంలోని హాంకాంగ్‌లో నిర‌సన‌లు, ఆందోళ‌న‌లు  వెల్లువెత్తుతున్నాయి. బాయ్‌కాట్ ములాన్ పేరుతో నిర‌స‌న‌కారులు త‌మ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఎప్పుడూ చైనా అణిచివేత ధోర‌ణికి వ్య‌తిరేకంగా పోరాటాలు చేసే ఆందోళ‌న‌కారులు ఇప్పుడు ములాన్ మూవీని టార్గెట్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి..? ‌ములాన్ మూవీపై వారు అంత ధ్వేషం పెంచుకోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది..? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలుసుకోవాలంటే మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళ్దాం..

గత ఏడాది చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఆందోళనలు మిన్నంటాయి. ఆ సంద‌ర్భంగా చైనాకు చెందిన ఓ జర్నలిస్టుపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ లియూ అప్ప‌ట్లో ఒక పోస్టు చేశారు. 'నేను కూడా హాంకాంగ్‌ పోలీసులకు మద్దతిస్తా. నన్ను కూడా మీరు కొట్టొచ్చు. ఇలాంటి దాడులు హాంకాంగ్‌కు సిగ్గుచేటు ' అని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. దాంతో హాంకాంగ్‌ నిరసనకారుల మ‌రింత ఆగ్ర‌హించారు. శాంతియుత ఆందోళ‌న‌ల‌ను క్రూరంగా అణిచివేస్తున్న పోలీసుల‌కు మ‌ద్ద‌తిస్తారా అంటూ లియూపై మండిప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు ఆమె న‌టించిన చిత్రం ములాన్‌కు వ్య‌తిరేకంగా బాయ్‌కాట్ ములాన్ పేరుతో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

జింజియాంగ్‌లో షూటింగ్ మ‌రో కార‌ణం

ములాన్ చిత్రంలో కొంత‌బాగాన్ని చైనాలోని జింజియాంగ్‌ ప్రావిన్సులో చిత్రీకరించారు. అక్క‌డ ఉయ్‌గర్, తదితర ముస్లిం వర్గాలను చైనా అణచివేస్తున్న‌ద‌నే ఆరోపణలున్నాయి. అక్క‌డ పెద్ద ఎత్తున నిర్బంధ కేంద్రాలను నిర్మించి ఉయ్‌గర్‌ ముస్లింలను నిర్బంధించారని అమెరికాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెల్ల‌డించాయి. అయితే అక్క‌డి ప‌రిస్థితుల‌ను చీత్రిక‌రించిన డిస్నీ సంస్థ ముస్లిం వ‌ర్గాల అణచివేత‌పై మిన్న‌కుండిపోయింది. ఇది కూడా ములాన్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు వెల్లువెత్త‌డానికి కార‌ణం అయ్యింది. logo