మీకు వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ ఉందా.. అదేంటో తెలుసుకోండి!

కరోనా ఇప్పటి వరకూ ఎన్నో కొత్త కొత్త విషయాలను మానవాళికి పరిచయం చేసింది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరాలు, లాక్డౌన్లు, కొత్త కొత్త ఆహారపు అలవాట్లు.. ఇలా మన జీవితాలు ఎన్నో రకాలుగా మారిపోయాయి. తాజాగా మరో కొత్త పదం కూడా ఈ లిస్ట్‌లో వచ్చి చేరింది. అదే వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ అప్లికేషన్. ఇదొక యాప్. నిజానికి ఒక్కటి కాదు. ఈ కేటగిరీలో ఎన్నో సంస్థలు యాప్స్ తీసుకొస్తున్నాయి. ఇక మీదట మీరు కరోనా నెగటివ్ అని ఆధారం చూపాలంటే ఈ యాప్ వాడాల్సి రావచ్చని ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ చెబుతోంది. కాన్సర్టలకు, స్టేడియాలకు, థియేటర్లకు.. అంతెందుకు ఇతర దేశాలకు వెళ్లాలన్నా.. ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వ్యాధి సంక్రమణను ఇది పెద్దగా అడ్డుకోకపోవచ్చని అంటోంది.
ఏంటీ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్?
- ఇందులో భాగంగా ఆయా కంపెనీలు రూపొందించిన యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అందులో మన కరోనా టెస్టుల ఫలితాలు, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఎక్కడైనా మీ కరోనా సంబంధిత వివరాలను అడిగినప్పుడు ఈ డిజిటల్ వివరాలను ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది.
- కామన్ ట్రస్ట్ నెట్వర్క్ రూపొందించిన CommonPass యాప్ కూడా అలాంటిదే. మీ కొవిడ్-19 టెస్ట్ ఫలితం, వ్యాక్సినేషన్ ఆధారాలకు సంబంధించిన డేటాను మీరు ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఓ క్యూఆర్ కోడ్ రూపంలో పాస్ జనరేట్ అవుతుంది. దీనిని అవసరమైన చోట చూపిస్తే సరిపోతుంది. ఇలాంటి యాప్స్ రూపొందిస్తున్న సంస్థలు.. పలు ఎయిర్‌లైన్స్‌తో చేతులు కలుపుతున్నాయి.
- ఐబీఎం కూడా Digital Health Pass పేరుతో ఓ యాప్ క్రియేట్ చేసింది. ఈ యాప్ ద్వారా సంబంధిత వ్యక్తి కరోనా వైరస్ టెస్టుల ఫలితాలు, శరీర ఉష్ణోగ్రత వివరాలను అవతలి వ్యక్తులు లేదా సంస్థలు తెలుసుకోవచ్చు.
- ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లనే ఆధారాలుగా పరిగణించి ఆయా వ్యక్తులను వారి పని ప్రదేశాలకు లేదా తమ దేశాల్లోకి అనుమతించాలంటూ కొన్ని దేశాలు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరడం గమనార్హం. దీనిపై డబ్ల్యూహెచ్‌వో కూడా స్పందించింది. అయితే ఇప్పటికే కొవిడ్ నుంచి కోలుకున్న వాళ్లు, యాంటీబాడీస్ ఉన్న వాళ్లకు మరోసారి వైరస్ సోకదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఈ ప్రతిపాదనపై పెదవి విరిచింది. ఇలాంటి సర్టిఫికెట్ల వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి
వ్యాక్సిన్లతో ఇమ్యూనిటీ పెంచడం పిల్లల ఆరోగ్యానికి మంచిదేనా..?
క్రికెట్ దాదా బీజేపీలో చేరుతున్నారా?
హైదరాబాద్ క్రికెట్లో అర్ధరాత్రి హైడ్రామా
ఆస్ట్రేలియాలో సిరాజ్, శ్రీధర్ పక్కా హైదరాబాదీ చాట్ చూశారా?
తాజావార్తలు
- అవును.. ఇండియన్ ప్లేయర్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు నిజమే
- ఆస్కార్ రేసులో సూరారై పొట్రు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి