బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 23, 2020 , 12:58:16

తైవాన్ నుంచి మనమేం నేర్చుకోవాలి?

తైవాన్ నుంచి మనమేం నేర్చుకోవాలి?

చైనాలో కరోనా కేసులు బయటికి రాగానే తైవాన్ ప్రభుత్వం.. ప్రత్యేకంగా జాతీయ ఆరోగ్య నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో అక్కడి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను కట్టడి చేసింది. బయటి దేశాల్నుంచి ఎవరినీ లోపలికి రానీయకుండా జాగ్రత్తలను తీసుకున్నది. ఆ తర్వాత, ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించి కరోనాను కట్టడి చేయడంపై దృష్టి సారించింది.  

ఆ దేశం చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే.. 

  • బిగ్ డేటా  సాయంతో కరోనా బాధితులను గుర్తించడం మొదలెట్టింది. 
  • అక్కడి జాతీయ ఆరోగ్య బీమా, కస్టమ్స్, ప్రజల ఆస్పత్రిల సందర్శనలు, అక్కడికి విచ్చేసే రోగుల లక్షణాలు, విమాన ప్రయాణ మార్గాలు వంటి సమాచారం సాయంతో ప్రత్యేకంగా డేటాను తయారు చేశారు. 
  • ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ ను ఉపయోగించి ప్రజలను నిత్యం అప్రమత్తం చేసింది. 
  • బిగ్ డేటా సాయంతో ఫలానా వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలియజేస్తూ సంక్షిప్త సందేశాన్ని అక్కడి సరిహద్దు అధికారులకు పంపించేవారు. ఇది అక్కడి ప్రజలకు ఒక పాస్ గా ఉపయోగపడింది. 
  • కరోనా అధికంగా ప్రబలించిన ఏరియాల్లో రోగ లక్షణాలున్న ప్రజలకు క్వారంటైన్ చేయడానికి, వారి కదలికల్ని పసిగట్టడానికి ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేశారు. 
  • మాస్కుల కొరత లేకుండా తైవాన్ పూర్తి స్థాయి చర్యల్ని తీసుకున్నది. ఏయే మెడికల్ షాపుల్లో ఎన్నెన్ని మాస్కులున్నాయో తెలియజేసే వివరాలను అక్కడి ప్రజలకు అందజేసింది. 


logo