శనివారం 28 నవంబర్ 2020
International - Nov 22, 2020 , 01:34:53

2 నెలలు సూర్యుడు మాయం!

2 నెలలు సూర్యుడు మాయం!

  • అలస్కాలోని పట్టణంలో విచిత్రం

జునోవ్‌: రెండు రోజులు సూర్యుడు కనిపించకపోతేనే ఇబ్బందిగా ఉంటుంది. మరి సుమారు రెండు నెలల పాటు కనిపించకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఎక్కడైనా జరుగుతుందా అని అనుకుంటున్నారా? అవును. నెలలపాటు సూర్యుడు కనిపించకుండా పోయే ప్రాంతం భూమ్మీద ఒకటి ఉంది. అదే అలస్కాలోని ఉట్‌కియాగ్విక్‌ పట్టణం. అక్కడి ప్రజలు గత బుధవారం చివరిసారిగా సూర్యోదయాన్ని చూశారు. మళ్లీ,  దినకరుడిని చూడాలంటే వచ్చే జనవరి 23, 2021 (దాదాపు 70 రోజులు ) వరకు వేచి చూడాల్సిందే. దీనికి కారణం.. ఆ పట్టణంలో సుదీర్ఘమైన ‘పోలార్‌ నైట్‌' ఏర్పడటమే. ’24 గంటల’ కంటే ఎక్కువ కాలంపాటు సూర్యుడు కనిపించకుండా ఉంటే దాన్ని ‘పోలార్‌ నైట్‌' అంటారు.