సోమవారం 26 అక్టోబర్ 2020
International - Oct 05, 2020 , 15:55:15

సోష‌ల్ మీడియాకు బానిస కాన‌టువంటి వ‌ధువు కావ‌లెను!

సోష‌ల్ మీడియాకు బానిస కాన‌టువంటి వ‌ధువు కావ‌లెను!

మంచి పెళ్లి సంబంధం కోసం కాళ్లు అరిగేలా తిర‌గ‌కుండా ఇంట్లోనే కూర్చొని న‌చ్చిన అమ్మాయి, అబ్బాయిని ఎంపిక చేసుకునేందుకు మ్యాట్రిమోనీ లాంటి ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ అందుబాటులోకి వ‌చ్చాయి. అమ్మాయి, అబ్బాయి వారి ప్రొఫైల్‌ను సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. దాన్నిబ‌ట్టి న‌చ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని పెళ్లిచేసుకుంటున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్రొఫైల్‌లో వారి అడ్రెస్‌, చ‌దువు, ప్రాప‌ర్టీస్‌, అందం, పొడ‌వు ఇలా వారి వివ‌రాల‌తో పాటు కాబోయే భాగ‌స్వామి ఎలా ఉండాలి అనే వివ‌రాలు ఉండేవి. ఇటీవ‌ల ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాకు బానిస కాన‌టువంటి వ‌ధువు కోసం వెతుకుతున్నాను అనే ప్ర‌క‌ట‌న ఇచ్చాడు.

పశ్చిమ బెంగాల్‌, కమర్‌పుకుర్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన‌ అమాట్రిమోనియల్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్ర‌స్తుత కాలంలో చేతిలో ఫోన్ ‌లేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. మ‌నుషుల మ‌ధ్య క‌న్నా సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా గ‌డుపుతున్నారు. అందుకే అత‌ను ఈ విధంగా ప్ర‌క‌ట‌న ఇచ్చి ఉంటాడు. దీనిని ఐఏఎస్ అధికారి నితిన్ సాంగ్వాన్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. 'పెళ్లి చేసుకోవ‌డానికి ఇంత‌కుముందు ఉన్న కండీష‌న్లు మారాయి. కాబోయే వ‌రుడు, వ‌ధువు తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం' అనే క్యాప్షన్‌ను జోడించారు.  

  


logo