బుధవారం 15 జూలై 2020
International - Jun 14, 2020 , 01:30:39

మాస్కే కాపాడింది! వైరస్‌ నుంచి గణనీయమైన రక్షణ

మాస్కే కాపాడింది! వైరస్‌ నుంచి గణనీయమైన రక్షణ

న్యూయార్క్‌: కరోనా వ్యాప్తి కట్టడిలో మాస్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అమెరికాలోని పీఎన్‌ఏఎస్‌ సంస్థ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇటలీలో, న్యూయార్క్‌లో వైరస్‌ కేసులు గణనీయంగా తగ్గడానికి మాస్కులను ధరించాలన్న నిబంధనలే ప్రధాన కారణమని పరిశోధకులు తెలిపారు. ‘ఏప్రిల్‌ 6న ఇటలీలో, అదేనెల 17న న్యూయార్క్‌లో మాస్కులను ధరించడం తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వాలు చెప్పాయి. దీంతో అప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

మాస్కులు ధరించడం, ఇతర నిబంధనలను పాటించడం వల్ల అంతకు ముందుతో పోలిస్తే, ఏప్రిల్‌ 6 నుంచి మే 9 వరకు ఇటలీలో దాదాపు 78 వేల కేసులు, న్యూయార్క్‌లో దాదాపు 66 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి’ అని వాళ్లు అంచనా వేశారు. న్యూయార్క్‌లో మాస్కు నిబంధన అమల్లోకి రాగానే రోజువారీగా నమోదయ్యే కేసులు 3 శాతం వరకు తగ్గాయని తెలిపారు.  ఇదే సమయంలో మాస్కు నిబంధనలు లేని ఇతర ప్రాంతాల్లో కేసుల నమోదులో తగ్గుదల కనిపించలేదన్నారు. కరోనా కట్టడికి భౌతిక దూరం నిబంధనలు, ఇంట్లో నుంచి బయటకు రాకూడదన్న నియమాల కంటే మాస్కులను ధరించడం మరింత ముఖ్యమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.  

తాజావార్తలు


logo