మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 23:04:31

ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు : ప్రధాని మోరిసన్

 ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు : ప్రధాని మోరిసన్

మెల్బోర్న్ : కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ పరీక్షల్లో ఉన్నాయి. టీకా అందుబాటులోకి రాగానే ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ప్రకటించారు. స్వీడన్-బ్రిటిష్ ఔషధ సంస్థ ఆస్ట్రాజెంకాతో ఆస్ట్రేలియా ప్రభుత్వం టీకా ఒప్పందం కుదుర్చుకున్నదని ఆయన తెలిపారు. దీనిని ఆక్స్ఫర్డ్  విశ్వవిద్యాలయంలో సిద్ధం చేస్తున్నారు. ఈ టీకా విజయవంతమైతే దాన్ని మేమే తయారు చేసుకుని మా దేశంలోని 2.5 కోట్ల మంది పౌరులకు ఉచితంగా అందజేస్తామని ఆయన చెప్పారు. కాగా, మంగళవారం వరకు ప్రపంచవ్యాప్తంగా 2.21 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,48,54,475 మంది రోగులు నయం కాగా, 7,78,883 మంది మరణించారు.

20-40 ఏండ్ల వాకిరి ఎఫెక్ట్ : డబ్ల్యూహెచ్వో

20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పశ్చిమ పసిఫిక్ రీజియన్ డైరెక్టర్ తకేషి కసాయి వీడియో కాన్ఫరెన్సింగ్‌లో మాట్లాడుతూ తెలిపారు. ఈ అంటువ్యాధి ఇప్పుడు నియంత్రణలో ఉన్న దేశాలలో వ్యాప్తించెందుతున్నట్లు తెలుస్తున్నది. చాలా దేశాలు మళ్ళీ లాక్డౌన్ కు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.


logo