గురువారం 02 జూలై 2020
International - May 27, 2020 , 17:33:27

భార‌త్‌, చైనా సంబంధాలు దెబ్బ‌తినొద్దు: చైనా రాయ‌బారి

భార‌త్‌, చైనా సంబంధాలు దెబ్బ‌తినొద్దు: చైనా రాయ‌బారి

న్యూఢిల్లీ: భార‌త్‌, చైనాలు దేశాలు రెండూ ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నాయ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని భార‌త్‌లో చైనా రాయ‌బారి స‌న్ వీడాంగ్ వ్యాఖ్యానించారు. భార‌త్, చైనా సంబంధాల‌కు సంబంధించి రెండు దేశాలకు చెందిన‌ యువ‌త వాస్త‌వాలు గ్ర‌హించాల‌ని ఆయ‌న సూచించారు. 

భార‌త్,  చైనా దేశాలు ఒక‌రిపై ఒక‌రు క‌య్యాల‌కు కాలు దువ్వుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, రెండు దేశాలు క‌లిసి ప‌ర‌స్ప‌రం అభివృద్ధి చెంద‌డానికి అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌న్ వీడాంగ్ పేర్కొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఇరు దేశాల సంబంధాల‌పై నీలినీడ‌లు క‌మ్ముకోనివ్వ‌కూడ‌ద‌ని, ఎలాంటి స‌మ‌స్య‌నైనా చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని వీడాంగ్ సూచించారు.    

 


logo