సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 06:36:07

పోరాటాన్ని ఆపేదిలేదు.. ట్రంప్‌

పోరాటాన్ని ఆపేదిలేదు.. ట్రంప్‌

వాషింగ్ట‌న్‌: అక్ర‌మ బ్యాలెట్ల లెక్కింపును నిలిపివేసేవ‌ర‌కు త‌మ‌ పోరాటాన్ని ఆపేదిలేద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఓటింగ్ ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త, ఎన్నిక‌ల ధ్రువీక‌ర‌ణ కోసం ఏ అవ‌కాశాన్ని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు. న్యాయ పోరాటంలో ఇది ఆరంభం మాత్ర‌మే అన్నారు. అక్ర‌మ ఓట్ల లెక్కింపును ఆపేవ‌ర‌కు ఒత్తిడి కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. న్యాయ‌బ‌ద్ధ‌మైన ఓట్ల‌నే లెక్కించాల‌ని, అక్ర‌మ ఓట్ల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో లెక్కించ‌కూడ‌ద‌ని తాము మొద‌టి నుంచి చెబుతున్నామ‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంపై అమెరికా ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌క‌ముంద‌ని, మేము దాన్ని నిలుపుకుంటామ‌ని చెప్పారు.  


విజ‌యానికి చేరువ‌లో బైడెన్‌ 

ఇక‌, డెమొక్రాట్ అభ్య‌ర్థి, మాజీ ఉపాధ్య‌క్షుడు జో బైడెన్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో చారిత్ర‌క విజ‌యానికి  చేరువ‌లో ఉన్నారు. నెవెడాలో ఆధిక్యంలో కొన‌సాగుతున్న బైడెన్, ఇప్ప‌టివ‌ర‌కు ట్రంప్ ఆధిక్యంలో ఉంటూ వ‌చ్చిన‌ జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో కూడా ముంద‌జ‌లోకి దూసుకువ‌చ్చారు. అల‌స్కా, నార్త్ కరోలినాలో మాత్ర‌మే ట్రంప్ త‌న ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. దీంతో విజ‌యానికి అవ‌ర‌స‌మైన 270 మ్యాజిక్ ఫిగ‌ర్‌కు బైడెన్ మ‌రింత చేరువ‌య్యారు. ‌