బుధవారం 03 జూన్ 2020
International - Mar 31, 2020 , 20:02:59

డ‌బ్ల్యూహెచ్‌వో, అమెరికాకు ముందే చెప్పాం..

డ‌బ్ల్యూహెచ్‌వో, అమెరికాకు ముందే చెప్పాం..

హైద‌రాబాద్:  కోవిడ్‌19 కొత్త త‌ర‌హా వైర‌స్ అని చైనా పేర్కొన్న‌ది. గ‌తంలో మేం ఎప్పుడూ ఇలాంటి వైర‌స్‌ను చూడ‌లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్ర‌తినిధి హువా చున్‌యుంగ్ పేర్కొన్నారు. దీన్ని గుర్తించి, అధ్య‌య‌నం చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 27వ తారీఖున కొన్ని అనుమానిత కేసుల‌ను గుర్తించామ‌ని, ఆ కేసుల‌పై ఎపిడ‌మాలాజిక‌ల్ స‌ర్వేను డిసెంబ‌ర్ 29వ తేదీన చేప‌ట్టామ‌న్నారు. ఓ రోజు త‌ర్వాత వుహాన్ హౌజ్ క‌మీష‌న్ ఎమ‌ర్జెన్సీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. చైనా హెల్త్ క‌మిష‌న్ జ‌న‌వ‌రి 31వ తేదీన వైద్య‌ నిపుణుల‌ను వుహాన్‌కు పంపించిందన్నారు. ఆన్‌సైట్ విచార‌ణ కోసం ఆ టీమ్‌ను పంపించార‌న్నారు. కానీ మేం అధికారికంగా వుహాన్ విష‌యాన్ని జ‌న‌వ‌రి 3వ తేదీనే డ‌బ్ల్యూహెచ్‌వోతో పాటు అమెరికా, ఇత‌ర దేశాల‌కు తెలియ‌జేశామ‌న్నారు. చైనాకు చెందిన సీడీసీ.. వైర‌స్‌కు చెందిన జ‌న్యుక్ర‌మాన్ని జ‌న‌వ‌రి 11వ తేదీన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్  చేసిన‌ట్లు చెప్పారు. జ‌న‌వ‌రి 23వ తేదీన వుహాన్‌ను ష‌ట్‌డౌన్ చేయాల‌ని ఆదేశించామ‌ని. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, తమ ప్ర‌య‌త్నాల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో మెచ్చుకున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.logo