శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 05, 2020 , 13:04:37

క‌రోనా జ‌న్యుక్ర‌మాన్ని గుర్తించాం: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

క‌రోనా జ‌న్యుక్ర‌మాన్ని గుర్తించాం: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

హైద‌రాబాద్‌:  కరోనా వైర‌స్ లేదా కోవిడ్‌19 వ్యాధికి ఎనిమిది వారాలు నిండాయి.  ప్రాణాంత‌కంగా మారిన క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ సిటీ నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్‌కు సంబంధించి ఇవాళ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన జ‌న్యు క్ర‌మాన్ని(జెన‌టిక సీక్వెన్స్‌) గుర్తించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నిక‌ల్ లీడ్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు.  ఇవాళ ఈ అంశంపై ఆమె మీడియాతో మాట్లాడారు. వైర‌స్‌కు సంబంధించిన జెన‌టిక్ విశ్లేష‌ణ జ‌రుగుతోంద‌న్నారు.  పాలీమిరేజ్ చైన్ రియాక్ష‌న్‌(పీసీఆర్‌)తో పాటు సీరాలిజిక‌ల్ విశ్లేష‌ణ‌ను ప‌రిశోధ‌న‌శాల‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.  కొత్త వ్యాధిగా రూపాంత‌రం చెందిన క‌రోనా వైర‌స్‌కు సంబంధించి కావాల్సినంత స‌మాచారం త‌మ ద‌గ్గ‌ర ఉంద‌ని కెర్కోవ్ చెప్పారు. వైర‌స్‌ను అతి త‌క్కువ స‌మ‌యంలో గుర్తించ‌డం అసాధార‌ణ‌మైన విష‌య‌మ‌న్నారు. వైర‌స్‌కు చెందిన జ‌న్యు క్ర‌మాన్ని కొన్ని రోజుల క్రిత‌మే షేర్ చేసిన‌ట్లు ఆమె చెప్పారు. ఇక ఇప్పుడు సిరాలాజిక‌ల్ అధ్య‌య‌నం సాగుతుంద‌న్నారు. చైనాతో పాటు బాధిత ప్ర‌పంచ దేశాలు కరోనా పాజిటివ్ వ్య‌క్తుల సీరమ్‌ను ప‌రీక్ష చేయ‌వ‌చ్చు అన్నారు. 



logo