శనివారం 06 జూన్ 2020
International - May 01, 2020 , 15:20:09

కిమ్ ఆరోగ్యం గురించి మాకు తెలియ‌దుః ఐరాస‌

కిమ్ ఆరోగ్యం గురించి మాకు తెలియ‌దుః ఐరాస‌

ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఐక్య‌రాజ్య‌స‌మితి కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. కిమ్ ఆరోగ్యం గురించి త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని వెల్ల‌డించారు. ఉత్త‌ర‌కొరియా ప్ర‌తినిధులు కూడా త‌మ‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని పేర్కొన్నారు. ఏప్రిల్ 15న ఉత్త‌ర‌కొరియా వ్య‌వ‌స్థాప‌కుడు కిమ్ ఇల్ సంగ్ జ‌యంతి వేడుక‌ల్లో కిమ్ పాల్గొన‌క‌పోవ‌టంతో ఆయ‌న ఆరోగ్యంపై అనేక వ‌దంతులు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఉత్త‌ర‌కొరియా ప్ర‌భుత్వం మాత్రం దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌తా ఇవ్వ‌లేదు. 


logo