ఆదివారం 24 జనవరి 2021
International - Dec 27, 2020 , 17:05:09

ఆ ఫార్ములా ప‌ట్టేశాం.. మా వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షితం!

ఆ ఫార్ములా ప‌ట్టేశాం.. మా వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షితం!

లండ‌న్‌: క‌రోనా మ‌హమ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు తాము త‌యారు చేసిన వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షిత‌మని ప్ర‌క‌టించారు బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్క‌ల్ సోరియోట్‌. వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచే ఆ విన్నింగ్ ఫార్ములాను ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సాధించాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం బ్రిట‌న్ డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ ఈ వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షిస్తోంది. హాస్పిటల్‌లో చికిత్స అవ‌స‌ర‌మైన తీవ్రమైన కొవిడ్ విష‌యంలో త‌మ వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షిత‌మని సండే టైమ్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సోరియోట్ స్ప‌ష్టం చేశారు. ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్ సాధించిన 95 శాతం, మోడెర్నా చెప్పిన 94.5 శాతం సామ‌ర్థ్యాన్ని త‌మ వ్యాక్సిన్ కూడా ట్ర‌య‌ల్స్‌లో అందుకుంటుంద‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. వ్యాక్సిన్ సామ‌ర్థ్యానికి సంబంధించి ఇత‌రుల ద‌గ్గ‌ర ఉన్న ఆ విన్నింగ్ ఫార్ములాను ఇప్పుడు తాము కూడా ప‌ట్టేశామ‌ని చెప్పారు. మొద‌ట్లో ఈ వ్యాక్సిన్ ప్ర‌యోగాలు భిన్న‌మైన ఫ‌లితాలు ఇవ్వ‌డంతో దీని సామ‌ర్థ్యంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 


logo