బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 08:02:55

చైనా షిప్పులు మాకొద్దు : భారత ప్రభుత్వ చమురు సంస్థలు

చైనా షిప్పులు మాకొద్దు : భారత ప్రభుత్వ చమురు సంస్థలు

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా కుట్రల కారణంగా రెండుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వ చమురు సంస్థలు చైనా షిప్పులను అద్దెకు తీసుకోరాదని నిర్ణయించాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థలు విదేశాల నుంచి చమురు, చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు చైనా నౌకలను అద్దెకు తీసుకుంటుంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటిస్థానంలో వేరేదేశాల నౌకలు వాడాలని నిర్ణయించినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. logo