సోమవారం 06 జూలై 2020
International - May 27, 2020 , 18:28:47

కావాలంటే మేం మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తాం: ట‌్రంప్‌

కావాలంటే మేం మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తాం: ట‌్రంప్‌

న్యూఢిల్లీ: భార‌త్, చైనా స‌రిహ‌ద్దుల్లో కొద్ది రోజులుగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రెండు దేశాలు అంగీక‌రిస్తే ఈ వివాదం ప‌రిష్కారానికి తాము మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే భార‌త్‌, చైనా దేశాల‌కు కూడా తెలియ‌జేశామ‌ని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ ట్వీట్‌పై ప్ర‌స్తుతానికి భార‌త్‌, చైనా దేశాలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వ‌లేదు. 

భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దు రేఖ అయిన వాస్త‌వాధీన రేఖ వెంట గ‌త కొన్ని రోజులుగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఇటీవ‌ల ల‌ఢ‌క్‌లోని ప్యాంగాంగ్ వ‌ద్ద‌, సిక్కింలో భార‌త్, చైనా సైనికులు ఒక‌రిని ఒక‌రు కొట్టుకున్నారు. దీంతో రెండు దేశాల మ‌ధ్య వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అంతేగాక చైనా స‌రిహ‌ద్దుల వెంట‌ ఎయిర్‌బేస్‌ను నిర్మించింది. యుద్ధ విమానాల‌ను సైతం మోహ‌రించింది. దీంతో భార‌త్ సైతం సైన్యాన్ని సిద్ధం చేసింది. ఈ నేప‌థ్యంలో ట్రంప్ ట్వీట్‌పై  స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.       ‌


logo