మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 15:32:45

ప్రాంక్ వీడియో.. అత‌ను ఇచ్చిన ఝ‌ల‌క్‌కు అమ్మాయిల రియాక్ష‌న్‌!

ప్రాంక్ వీడియో.. అత‌ను ఇచ్చిన ఝ‌ల‌క్‌కు అమ్మాయిల రియాక్ష‌న్‌!

ఒక అమ్మాయి చేసే గోల‌కే టాప్ లేసిపోద్ది. అలాంటిది న‌లుగురు అమ్మాయిలు ఒకచోట చేరితే ఇంకేమైనా ఉందా? ఒక అత‌ను చేతిలో పెద్ద ఎత్తున డ‌బ్బాల‌ను ప‌ట్టుకొని వెళ్తున్నాడు. అత‌ను న‌డుస్తూ అటుగా వ‌స్తున్న న‌లుగురు అమ్మాయిల మీద ప‌డ‌బోయాడు. అంతే అవి నిజంగా ప‌డ్డాయ‌ని ఇద్ద‌రు మ‌హిళలు భ‌య‌ప‌డి కింద ప‌డిపోయారు. తీరా చూస్తే ఆ డబ్బాల‌న్నీ సేఫ్‌గా అత‌ని చేతిలోనే ఉన్నాయి. కానీ వారు కింద‌ప‌డ‌టంతో ఆమెతో ఉన్నవాళ్లు, అత‌ను ప‌డి ప‌డి న‌వ్వారు.

ఇలా జ‌రుగుతుంద‌ని అత‌నికి ముందే తెలుసు. కావాల‌నే అమ్మాయిల‌కు ఒక ఝ‌ల‌క్‌ ఇచ్చాడ‌ని కెమెరాలో రికర్డు అయిన అత‌ని ముఖ క‌వ‌లిక‌లు చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇదొక ప్రాంక్ వీడియో. ఈ విష‌యం తెలియ‌గానే అమ్మాయిలు కూడా న‌వ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 


logo