శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 20:06:47

దేశ అధ్యక్షుడు.. సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి ఇద్దరు మహిళలను కాపాడాడు..

దేశ అధ్యక్షుడు.. సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి ఇద్దరు మహిళలను కాపాడాడు..

లిస్బన్‌: ఆయన ఓ దేశ అధ్యక్షుడు. పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఓ బీచ్‌లో పర్యటిస్తున్నారు. అదే సమయంలో కయాక్‌(చిన్న బోటు) బోల్తాపడి నీళ్లలో ఇద్దరు మహిళలు మునిగిపోతున్నారు. గమనించిన ఆ అధ్యక్షుడు వెంటనే ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడాడు. 

ఈ సంఘటన పోర్చుగల్‌ దేశం అల్గార్వేలోని ఒక బీచ్‌లో జరిగింది. ఆ దేశ అధ్యక్షడు మార్సెలో రెబెలో డిసౌసా (71). వయస్సును కూడా లెక్కచేయకుండా సాహసం చేసి మహిళలను రక్షించారు. చాలాదూరం ఈదుకుంటూ వెళ్లిన అతడు కయాక్‌ వద్దకు చేరుకొని, వారిని మరో బోటులో ఎక్కించారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. అధ్యక్షుడు అంటే ఇలా ఉండాలి అంటూ అందరూ కామెంట్‌ చేస్తున్నారు.   


logo