బీజింగ్: ఒక బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగి మంటలు అంటుకోగా అందులోని బాలికలను ఆరుగురు శ్రమించి కాపాడారు. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. జిన్టియన్ నగరంలోని ఒక బహుళ అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇద్దరు బాలికలు ఒక అపార్ట్మెంట్లో చిక్కుకుపోయారు. గమనించిన ఆరుగురు వ్యక్తులు ఒట్టి చేతులతో గ్రిల్స్ ఆధారంగా పైకి ఎక్కి ఆ అంతస్తు నుంచి కింద వరకు మానవ నిచ్చెనగా ఏర్పడ్డారు. ఇంట్లో చిక్కుకున్న ఇద్దరు బాలికలను రక్షించారు. కాగా, ట్రెండింగ్ ఇన్ చైనా పేరుతో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది.