బుధవారం 03 జూన్ 2020
International - May 03, 2020 , 09:55:14

వారెన్ బ‌ఫెట్‌కు 50 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం

వారెన్ బ‌ఫెట్‌కు 50 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం


హైద‌రాబాద్‌: ప్ర‌పంచ కుబేరుడు వారెన్ బ‌ఫెట్‌కు బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ తొలి క్వార్ట‌ర్‌లో సుమారు 50 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టాన్ని చ‌విచూసింది. కంపెనీ చ‌రిత్ర‌లో ఇంత న‌ష్టం రావ‌డం ఇదే తొలిసారి.  క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆ కంపెనీ తీవ్ర న‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న‌ది. బెర్క్‌షైర్ గ్రూప ఆఫ్ కంపెనీలో గీకో ఆటో ఇన్సూరెన్స్‌, బ‌ర్లింగ్ట‌న్ నార్త‌ర్న్ సాంటా ఫీ రెయిల్‌రోడ్‌, డైరీ క్వీన్‌, డూరాసెల్ లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి.  స్టాక్‌మార్కెట్ శ‌నివారం ఇచ్చిన ఫైలింగ్‌లో.. బ‌ఫెట్ కంపెనీ న‌ష్టానికి సంబంధించిన రిపోర్ట్‌ను స‌మ‌ర్పించింది. ఈ ఏడాది బెర్క్‌షైర్ షేర్లు సుమారు 20 శాతం ప‌డిపోయిన‌ట్లు చెబుతున్నారు. బెర్క్‌షైర్‌కు చెందిన దాదాపు 90 వ్యాపారాలు ఏప్రిల్ మాసంలో ఎటువంటి ఆదాయాన్ని ఆర్జించ‌లేక‌పోయాయి. గ‌త ఏడాది అమెరికాకు చెందిన ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల్లో బెర్క్‌షైర్ భారీ పెట్టుబ‌డులు పెట్టింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల విమాన సంస్థ‌లు స‌ర్వీసులు నిలిపివేయ‌డంతో.. బ‌ఫెట్‌కు దాని వ‌ల్ల కూడా భారీ న‌ష్టం వ‌చ్చింది.logo