గురువారం 04 జూన్ 2020
International - Apr 18, 2020 , 15:48:42

కరోనాపై పోరుకు వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ రూ. 46 కోట్లు విరాళం

కరోనాపై పోరుకు వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ రూ. 46 కోట్లు విరాళం

న్యూఢిల్లీ: కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రముఖ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లు రూ.46 కోట్లు విరాళంగా అందిస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాన్ని కరోనాపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) అందించడానికి, రైతులు, చిన్నవ్యాపారులకు అవసరమైన సామాగ్రిని అందించే సంస్థలకు ఇస్తామని పేర్కొన్నాయి.  రూ.38.3 కోట్లతో ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు, మెడికల్‌ గౌన్లను ఎన్‌జీవోల ద్వారా అందిస్తామని వెల్లడించాయి. కరోనా వల్ల సంక్షభం ఎదుర్కొంటున్న బలహీన వర్గాలకు మరో రూ.7.7 కోట్లు ఇవ్వనున్నామని తెలిపాయి. 


logo