మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 15:48:53

శున‌కాల‌తో పోలింగ్ బూత్‌కు..

శున‌కాల‌తో పోలింగ్ బూత్‌కు..

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓటింగ్ ఇవాళ ప్రారంభ‌మైంది.  పోలింగ్ బూత్‌ల‌కు కొంద‌రు త‌మ పెట్స్‌తో వ‌స్తున్నారు.  న్యూ హ్యాంప్‌షైర్‌లోని  డిక్స్‌విల్లీ గ్రామంలో బైడెన్ తొలి విజ‌యం సాధించారు.  ఆ గ్రామంలో ఆయ‌న‌కు అయిదు ఓట్లు పోల‌య్యాయి. డిక్స్‌విల్లీ పోలింగ్ బూత్‌కు స్థానిక ఓట‌రు ఒక‌రు శున‌కంతో వ‌చ్చారు. ఎల‌క్ష‌న్ డే రోజున చాలా మంది ఓట‌ర్లు శున‌కాల‌తో పోలింగ్ బూత్‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక వెర్మాంట్ రాష్ట్రంలో పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ రాష్ట్రంలో ఉద‌యం 5 గంట‌ల‌కే పోలింగ్ ప్రారంభం అవుతుంది.  1992 నుంచి ఆ రాష్ట్రంలో డెమోక్ర‌టిక్ పార్టీదే హ‌వా న‌డుస్తోంది.  కానీ 2016లో ట్రంప్ ఆ రాష్ట్రాన్ని కైవ‌సం చేసుకున్నారు.  ఈసారి ఆ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌ను కూడా ఎన్నుకుంటున్నారు. ట్రంప్‌, బైడెన్ మ‌ధ్య సూప‌ర్ టైట్ రేసు త‌ప్పేట‌ట్లు లేదు.  కానీ ఫోటో ఫినిష్‌లో ట్రంప్ గ‌ట్టెక్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.