మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Jun 18, 2020 , 07:24:44

ఐరాస సాధరణ సభ అధ్యక్షుడిగా వోల్కాన్‌

ఐరాస సాధరణ సభ అధ్యక్షుడిగా వోల్కాన్‌

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తదుపరి అధ్యక్షుడిగా టర్కీ దౌత్యవేత్త వోల్కాన్‌ బోజ్కిర్‌ ఎన్నికయ్యారు. దీంతో జనరల్‌ అసెంబ్లీకి న్యాయకత్వం వహించిన మొదటి టర్కిష్‌ జాతీయుడిగా నిలిచారు. సాధారణ సభ వార్షిక సమావేశం ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో 75వ సాధారణ చర్చకు వోల్కాన్‌ అధ్యక్షత వహించనున్నారు. రహస్య బ్యాలెట్‌ పద్దతిలో జరిగిన ఓటింగ్‌లో ఆయన అత్యధిక మెజారిటీ విజయం సాధించారు. ఓటింగ్‌లో 178 దేశాలు ఆయనకు మద్దతు తెలపగా, 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. 

కరోనా వైరస్‌ కారణంగా ఐక్యరాజ్య సమితి 75 ఏండ్ల చరిత్రలో మొదటిసారిగా వర్చూవల్‌ రూపంలో సమావేశానికి సిద్ధమవుతున్నది. ఈ ఏడాది ఐరాస సాధారణ సభ సెప్టెంబర్‌ 15న ప్రారంభమవనుంది. 

వోల్కాన్‌ బోజ్కిర్‌ 40 ఏండ్లపాటు జర్మనీ, ఇరాక్‌, న్యూయార్క్‌, రొమేనియాలో దౌత్యవేత్తగా పనిచేశారు. 2011లో టర్కీ శాసన సభకు ఎన్నికయ్యారు. టర్కీ యూరోపియన్‌ వ్యవహరాల మంత్రిగా, చీఫ్‌ నెగోషియేటర్‌గా పనిచేశారు.