వచ్చే వారం నుంచి రష్యాలో సామూహిక టీకాలు

మాస్కో: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రష్యాలో 589 కొత్త మరణాలను నమోదయ్యాయి. దాంతో వచ్చే వారం సామూహికంగా స్వచ్ఛంద టీకాలు ఇవ్వడం మొదలుపెట్టేందుకు రష్యా సిద్ధమవుతున్నది. కొవిడ్-19కు వ్యతిరేకంగా తయారుచేసిన వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ వేయాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రష్యా అధికారులను ఆదేశించారు. రాబోయే కొన్ని రోజుల్లో రష్యా 2 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులను ఉత్పత్తి చేస్తుందని పుతిన్ చెప్పారు. గత నెలలో తమ స్పుత్నిక్ వీ జబ్ మధ్యంతర ఫలితాల ప్రకారం కొవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడంలో 92 శాతం ప్రభావవంతంగా ఉందన్నారు. పెద్ద ఎత్తున టీకాలు వేయడం డిసెంబర్లో స్వచ్ఛంద ప్రాతిపదికన ప్రారంభమవుతుందని ఉప ప్రధాని టటియానా గోలికోవా తెలిపారు.
నవంబర్ 27 న అంటువ్యాధుల పెరుగుదల మందగించింది. బుధవారం నాడు రష్యాలో 25,345 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ యొక్క సెకండ్ వేవ్ సమయంలో లాక్డౌన్లను విధించడాన్ని రష్యా ప్రతిఘటించింది. 2,347,401 ఇన్ఫెక్షన్లతో రష్యా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, ఇండియా, బ్రెజిల్ దేశాలున్నాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో 41,053 మరణాలు నమోదయ్యాయి.
టీకాలు వేయడానికి రష్యన్లు మొదటి స్థానంలో ఉన్నారని క్రెమ్లిన్ ఇంతకుముందు హామీ ఇచ్చింది. మాస్కో ఇతర దేశాలతో సరఫరా ఒప్పందాలపై కూడా చర్చించింది. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి రష్యన్ల అవసరాలను తీరుస్తుంది అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు. బుధవారం 3,684 కొత్త అంటువ్యాధులను నివేదించిన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అధికారులు.. అక్కడ కేసుల పెరుగుదలను ఎదుర్కోవటానికి డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించారు. రష్యా నూతన సంవత్సర సెలవుల కాలానికి డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకు 5 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరాల్లో మ్యూజియంలు, థియేటర్లు, కచేరీ హాళ్ళు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?
- తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- కేంద్రమే రైతులను రెచ్చగొట్టింది : శివసేన
- 30 నిమిషాల్లో 30 కేజీల ఆరెంజెస్ తిన్నారు.. ఎందుకంటే?
- అనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్ ' ట్రైలర్