యూఎస్ సర్జన్ జనరల్‌గా వివేక్‌మూర్తి

- వైద్యమంత్రిగా జేవియర్ బెకెర్రా
- హెల్త్టీమ్ను ప్రకటించిన బైడెన్
వాషింగ్టన్: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తన హెల్త్ టీమ్‌ను ప్రకటించారు. వైద్య శాఖ మంత్రిగా జేవియర్ బెకెర్రా, సర్జన్ జనరల్‌గా ఇండియన్ అమెరికన్ వివేక్ మూర్తిని నియమించారు. కొవిడ్-19పై అధ్యక్షుడికి ప్రధాన సలహాదారుగా సాంక్రమిక వ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌసీ పేరును ప్రకటించారు. అలాగే ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' డైరెక్టర్‌గా రోషెల్ వాలెన్స్కీ, కొవిడ్-19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్ చైర్‌పర్సన్‌గా మార్కెల్లా నుమెజ్ స్మిత్‌ను నియమించారు. ఈ సమర్థ నాయకత్వ బృందం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని బైడెన్ పేర్కొన్నారు. కరోనా పరీక్షల నిర్వహణ, వ్యాక్సిన్ పంపిణీ, పాఠశాలలు, పరిశ్రమల పునఃప్రారంభం, వైద్య సేవలను విస్తరించడంలో అన్ని వనరులను సమీకృతపరిచేందుకు ఈ నిపుణుల బృందం మొదటి రోజు నుంచే పని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు.