వాషింగ్టన్: ప్రవాస భారతీయ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు 57-43 ఓట్లతో అమెరికన్ సెనేట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది. 43 ఏండ్ల మూర్తి అమెరికా సర్జన్ జనరల్‌గా నియమితులవ్వడం ఇది రెండోసారి. 2013లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో మూర్తి ఈ పదవిని చేపట్టారు.