గురువారం 04 జూన్ 2020
International - Apr 17, 2020 , 16:28:43

కూల్ టెంప‌రేచ‌ర్నే వైర‌స్ ఇష్ట‌ప‌డుతుంది..

కూల్ టెంప‌రేచ‌ర్నే వైర‌స్ ఇష్ట‌ప‌డుతుంది..

హైద‌రాబాద్‌: చైనాకు చెందిన మేటి శ్వాస‌కోస నిపుణుడు జాంగ్ నాన్‌షాన్.. వైర‌స్ గురించి కొన్ని కీల‌క అంశాలు వెల్ల‌డించారు. వైర‌స్‌ శీత‌ల వాతావ‌ర‌ణాన్ని ఇష్ట‌ప‌డుతుంద‌న్నారు. ద‌క్షిణ ద్ర‌వంలో ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిన త‌ర్వాత‌.. వైర‌స్ వ్యాపించే అవ‌కాశాలు ఉన్నాయన్నారు. వెద‌ర్‌ 4 డిగ్రీల సెల్సియ‌స్ ఉంటే.. వైర‌స్ ఎక్కువ‌గా బ్ర‌తుకుతుందన్నారు. దానికి అదే  అనుకూల‌మైన వాతావ‌ర‌ణం అన్నారు.  4 నుంచి 16 డిగ్రీల సెల్సియ‌స్ వాతావ‌ర‌ణంలో వైర‌స్ ఎక్కువ విస్త‌రిస్తుంద‌న్నారు. అందుకే ద‌క్షిణ ద్రువ ప్రాంతాల్లో శీతాకాలంలో వైర‌స్ వ్యాప్తి జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ప్ర‌స్తుతం  ఉత్త‌ర ద్రువంలో  వాతావ‌ర‌ణం వేడెక్కుతున్నది. దాంతో ఆ ప్రాంతాల్లో కేసుల సంఖ్య త‌గ్గే ఛాన్సు ఉన్నద‌ని జాంగ్ నాన్‌షాన్ తెలిపారు. ఆఫ్రికా లాంటి దేశాలు ఇప్పుడు వైర‌స్‌ను క‌ట్ట‌డి చేస్తే,  వాతావ‌ర‌ణం వేడెక్కిన త‌ర్వాత ప‌రిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయన్నారు.  సాధార‌ణంగా శ్వాసకోస వ్యాధులు ఉష్ణోగ్ర‌త‌ల‌తో లింకై ఉంటాయ‌న్నారు.  టెంప‌రేచ‌ర్ వేడిగా ఉంటే.. అప్పుడు వైర‌స్ ఉదృతి త‌క్కువగా ఉంటుంద‌ని నాన్‌షాన్ చెప్పారు. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితుల‌ను మానిట‌ర్ చేయాల‌న్నారు. ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయిన‌ప్పుడు ప్ర‌త్యేక‌ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. జ‌న‌స‌మూహం మ‌ధ్య ఉన్న‌ప్పుడు మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌న్నారు.


logo