బుధవారం 27 మే 2020
International - Apr 08, 2020 , 18:33:33

వుహాన్‌ ఊపిరి పీల్చుకుంది.. వీడియో

వుహాన్‌ ఊపిరి పీల్చుకుంది.. వీడియో

వుహాన్‌ ఊపిరి పీల్చుకుంది.. వుహాన్‌ ఏకాంత వీడింది..76 రోజుల త‌ర్వాత నిర్బంధంనుంచి అడుగు బయట పెట్టింది.. లాక్‌డౌన్ నుంచి వుహాన్ విముక్తి పొందింది. బస్సులు, రైళ్లు కదిలాయి... విమానాలు ఎగిరాయి... బైకులు రయ్‌మన్నాయి.. వుహాన్‌ మళ్లీ బిజీగా మారింది.. జనం మాస్కులు, యాంటీ వైరస్‌ సూట్లు ధరించి జనం బయటికి వస్తున్నారు.. 

వుహాన్‌కు మళ్లీ రెక్కలొచ్చాయి..వీడియో మీకోసం


వుహాన్ నుంచి తొలి బుల్లెట్ రైలు ఉద‌యం 7.06 నిమిషాల‌కు క‌దిలింది. అంత‌కుముందే 6.30 నిమిషాల‌కు ఓ లోక‌ల్ ట్రైన్ జాంగ్‌జూకు ప‌య‌న‌మైంది. ఇక ఉద‌యం 7.24 నిమిషాల‌కు వుహాన్ తియ‌నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి విమానం ఎగిరింది.  46 మంది ప్ర‌యాణికుల‌తో ద‌క్షిణ చైనాలో ఉన్న సాన్య న‌గ‌రానికి అది వెళ్లింది. జ‌న‌వ‌రి 23వ తేదీ త‌ర్వాత మ‌ళ్లీ వుహాన్‌లో రైళ్లు, విమానాల క‌దలిక‌లు మొద‌ల‌య్యాయి. దీంతో అక్క‌డ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. 


logo