బుధవారం 03 జూన్ 2020
International - Apr 29, 2020 , 07:38:28

క‌రోనా ఏటా ప‌ల‌క‌రిస్తుందట‌

క‌రోనా ఏటా ప‌ల‌క‌రిస్తుందట‌

ఊహించ‌ని ఉప్పెన‌లా వచ్చిప‌డి ప్ర‌పంచ జ‌న‌జీవ‌నాన్ని చిన్నాభిన్నం చేసిన కోవిడ్‌-19 వైర‌స్ కొంత‌కాలం ఉండి ఆ త‌ర్వాత స‌మ‌సిపోయేది కాద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఈ మ‌హ‌మ్మారి ఏటా తిర‌గ‌బెడుతుంద‌ని చెపుతున్నారు. ఏటా వ‌చ్చే సీజ‌న‌ల్ ఫ్లూ వ్యాధుల్లాగే ఇది కూడా విజృంభిస్తుంద‌ని చైనీస్ అకాడ‌మీ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాతోజీన్ బ‌యాలజీ డైరెక్ట‌ర్ జిన్ క్వి తెలిపారు. అమెరికా అత్యున్న‌త వైద్యాధికారి ఆంటోనీ ఫాసీ కూడా ఈ వ్యాధి ప్ర‌తి శీతాకాలంలో తిరిగి వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు. 

ఈ వైర‌స్ విస్త‌ర‌ణ అసాధార‌ణ వేగంతో ఉంద‌ని భార‌త వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది రోగుల్లో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌టంలేద‌ని దాంతో ప‌రీక్ష‌లు చేయించుకోవ‌టంలేద‌ని అంటున్నారు. అలాంటివారు వైర‌స్ వ్యాప్త‌కి వాహ‌కులుగా మారే ప్ర‌మాదం ఉంద‌ని అదే జ‌రిగితే వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తుంద‌ని గాంధీన‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ దిలీప్ మౌలాంక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. 


logo