శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 20, 2020 , 01:20:02

వైరస్‌ లీక్‌ అసాధ్యం

వైరస్‌ లీక్‌ అసాధ్యం

  • వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ డైరెక్టర్‌ వెల్లడి

బీజింగ్‌: చైనాలోని వుహాన్‌ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబొరేటరీ నుంచే కరోనా వైరస్‌ బయటికి వచ్చిందని వస్తున్న ఆరోపణలను దాని డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ తోసిపుచ్చారు. చైనాకు చెందిన అధికార మీడియా సీజీటీఎన్‌తో ఆయన మాట్లాడుతూ తమ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వైరస్‌ బయటికి రావడం అసాధ్యమని, ఇలా అస్సలు జరుగలేదని చెప్పారు. కరోనా వైరస్‌తో ముడిపడి ఉన్న అంశాలపై ల్యాబొరేటరీలో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, ఆ వైరస్‌ ఇక్కడి నుంచే బయటికి వెళ్లిందన్న దానిలో వాస్తవం లేదని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే తొలుత ల్యాబొరేటరీలో ఉన్న సిబ్బందికి వైరస్‌ సోకాలని, కానీ అలా జరుగలేదని పేర్కొన్నారు. ల్యాబొరేటరీలో జరుగుతున్న అన్ని పరీక్షలపై తమకు పూర్తి అవగాహన ఉంటుందని యువాన్‌ చెప్పారు. కానీ కొంత మంది తమపై బురద జల్లుతున్నారని తెలిపారు. logo