శనివారం 30 మే 2020
International - Apr 08, 2020 , 00:51:56

మాస్కులతో వైరస్‌ కట్టడికాదు

మాస్కులతో వైరస్‌ కట్టడికాదు

  • చేతులు శుభ్రం, నిర్ణీత దూరమే ముఖ్యం: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కేవలం మాస్కులు వాడటంతోనే కరోనాను కట్టడి చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి టెడ్రోస్‌ అధానోమ్‌ గేబ్రియేసస్‌ తెలిపారు. చేతులు శుభ్రం చేసుకోవడం, నిర్ణీత దూరం పాటించడమే ఎంతో ముఖ్యమన్నారు. అయితే సంక్షోభ ప్రాంతాల్లో దుర్భర జీవితం గడుపుతూ సామాజిక దూరం పాటించలేనివారు, నీటి వసతి లేక చేతులు శుభ్రం చేసుకోలేనివారు సాధారణ మాస్కులు ధరించడం మేలన్నారు. వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించే వైద్య సిబ్బంది, వారికి సేవలు చేసేవారు వైద్యపరమైన మాస్కుల కొరత ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు వీటిని వినియోగించవద్దని టెడ్రోస్‌ సూచించారు. కాగా, కరోనా టీకాను ఆఫ్రికా ప్రజలపై ప్రయోగించాలన్న ఇద్దరు ప్రముఖ ఫ్రెంచ్‌ డాక్టర్ల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 


logo