ఆదివారం 31 మే 2020
International - May 08, 2020 , 14:16:52

విద్వేషాన్ని రెచ్చ‌గొడుతున్న వైర‌స్‌.. యూఎన్ చీఫ్ వార్నింగ్‌

విద్వేషాన్ని రెచ్చ‌గొడుతున్న వైర‌స్‌.. యూఎన్ చీఫ్ వార్నింగ్‌హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా విద్వేష వాతావ‌ర‌ణం పెరిగింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు. మ‌హ‌మ్మారి వ‌ల్ల పెరిగిన విద్వేష సంఘ‌ట‌న‌ల‌ను ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విదేశీయుల‌ను వ్య‌తిరేకించే భావోద్వేగాలు పెరుగుతున్నాయ‌న్నారు.  ఓ వ‌ర్గం ప‌ట్ల వివ‌క్ష పెరుగుతోంద‌న్నారు.  ముస్లిం వ్య‌తిరేక దాడులు కూడా జ‌రుగుతున్న‌ట్లు గుటెర్ర‌స్ తెలిపారు.  వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల విద్వేష ఘ‌ట‌న‌లు సునామీలా విరుచుకుప‌డుతున్నాయ‌న్నారు.  అయితే ఈ విష‌యంలో యూఎన్ చీఫ్.. సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న దేశాల గురించి ఎటువంటి విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. ఇటువంటి రుగ్మ‌త‌ల‌ను రూపుమాపేందుకు అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌న్నారు.  వ‌ల‌స కార్మికులు, శ‌ర‌ణార్థులు తీవ్ర ప్ర‌భావానికి లోనైన‌ట్లు చెప్పారు. వైర‌స్ పేరు చెబుతూ వైద్య చికిత్స‌కు నిరాక‌రిస్తున్నార‌న్నారు.  జాతివిద్వేష‌, హానిక‌ర‌మైన అంశాలను తొల‌గించాల‌ని ఆయ‌న మీడియాను కోరారు. ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ పెరుగుతున్న నేప‌థ్యంలో డిజిట‌ల్ అక్ష‌రాభ్యాసంపై దృష్టి పెట్టాల‌ని ఆయ‌న విద్యాసంస్థ‌ల‌ను కోరారు.  


logo