బుధవారం 03 జూన్ 2020
International - May 14, 2020 , 13:43:25

క‌రోనాతో పెరుగుతున్న‌ మాన‌సిక స‌మ‌స్య‌లు : ఐక్య‌రాజ్య‌స‌మితి

క‌రోనాతో పెరుగుతున్న‌ మాన‌సిక స‌మ‌స్య‌లు : ఐక్య‌రాజ్య‌స‌మితిహైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మాన‌సిక స‌మ‌స్య‌లు పెరుగుతున్న‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వైర‌స్‌పై పోరాడుతున్న దేశాలు ఇక మాన‌సిక రుగ్మ‌త‌ల‌పై కూడా దృష్టి పెట్టాల‌ని యూఎన్ కోరింది.  వైద్య సిబ్బంది, ఉద్యోగాలు కోల్పోయిన‌వారు, వృధ్ధులు, ఒంట‌రిగా ఉన్న‌వారు.. తీవ్ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌ట్లు యూఎన్ పేర్కొన్న‌ది. దీనికి సంబంధించి ఓ డాక్యుమెంట్‌ను కూడా రిలీజ్ చేశారు. కోవిడ్ రెస్పాన్స్ ప్లాన్‌లో కూడా మాన‌సిక స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వాలు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించింది. స‌మాజం బాగుండాలంటే మంచి మానసిక ఆరోగ్యం ముఖ్య‌మ‌ని యూఎన్ తెలిపింది. ఒక‌వేళ మాన‌సిక స‌మ‌తుల్య‌త లోపిస్తే,  అప్పుడు ప‌రిస్థితులు గంద‌ర‌గోళంగా ఉంటాయ‌న్న‌ది.


logo