బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 14:17:40

ఇండియా, అమెరికా ర‌క్ష‌ణ రంగ ప్ర‌తినిధుల వర్చువ‌ల్ సమావేశం

ఇండియా, అమెరికా ర‌క్ష‌ణ రంగ ప్ర‌తినిధుల వర్చువ‌ల్ సమావేశం

ఢిల్లీ : డిఫెన్స్ టెక్నాల‌జీ అండ్ ట్రేడ్ ఇన్షియేటివ్ ( డిటిటిఐ) గ్రూప్ కు సంబంధించిన ప‌దో స‌మావేశం విర్చువ‌ల్ విధానం ద్వారా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త‌దేశం త‌ర‌ఫున ర‌క్ష‌ణ రంగ కార్య‌ద‌ర్శి రాజ్ కుమార్ స‌హ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా అమెరికా రక్ష‌ణ రంగ విభాగాన్నించి అండ‌ర్ సెక్ర‌ట‌రీ మిస్ ఎల్లెన్ ఎం లార్డ్ స‌హ అధ్య‌క్ష‌త‌వ‌హించారు. డిటిటిఐ గ్రూప్ స‌మావేశాలు సాధార‌ణంగా ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హిస్తారు. ఒక‌సారి ఇండియాలో జ‌రిగితే మ‌రోసారి అమెరికాలో జ‌రుగుతాయి. అయితే ఈ సారి కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ స‌మావేశాన్ని విర్చువ‌ల్ విధానం నిర్వ‌హించారు.

ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాల‌ను ఇరుదేశాలు క‌లిసి ఉత్ప‌త్తి చేయ‌డం, అభివృద్ధి చేయ‌డం కోసం ఇరు దేశాలు ద్వైపాక్షికంగా ర‌క్ష‌ణ‌రంగ వాణిజ్య సంబంధాలను క‌లిగి ఉండడమే డిటిటిఐ గ్రూప్ లక్ష్యం. డిటిటిఐ కింద తిరిగి నాలుగు ఉమ్మ‌డిగా ప‌ని చేసే వ‌ర్కింగ్ గ్రూపులున్నాయి. భూత‌లంమీద ప‌ని చేసే సైనికుల‌కోసం, నావికాద‌ళం కోసం, వైమానిక ద‌ళం కోసం, ఎయిర్‌క్రాప్ట్ క్యారియ‌ర్ సాంకేతిక‌త‌ల‌కు సంబంధించి ఈ నాలుగు గ్రూపుల‌ను ఏర్పాటు చేశారు. త‌మ ప‌రిధిలో కొన‌సాగుతున్న కార్య‌క‌లాపాల గురించి ఆయా గ్రూపులు స‌మావేశ స‌హ అధ్య‌క్షుల‌కు వివ‌రించారు.

డిటిటిఐ విజ‌యాన్ని తెలియ‌జేసే విధంగా ఈ స‌మావేశ స‌హ అధ్య‌క్షులు స్టేట్ మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్ ఓ ఐ) మీద సంత‌కాలు చేశారు. ర‌క్ష‌ణ రంగ సాంకేతిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకుంటామ‌ని, వివ‌ర‌ణాత్మ‌క‌మైన ప్ర‌ణాళిక‌ద్వారా, స్ప‌ష్ట‌మైన ప్ర‌గ‌తి సాధించ‌డంద్వారా ఈ ప‌ని చేస్తామ‌ని ఎస్ ఓ ఐ లో ప్ర‌క‌టించారు. గ‌త డిటిటిఐ గ్రూప్ స‌మావేశం గ‌తేడాది అక్టోబ‌ర్ లో జ‌రిగింది. ఆ స‌మావేశం త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య‌న‌ స‌హ‌కారంతో సాగే ప్రాజెక్టుల గుర్తింపునకు సంబంధించి స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ పూర్తయింద‌ని ఈ స‌మావేశ స‌హ అధ్య‌క్షులు సంతోషాన్ని వెలిబుచ్చారు. logo