మంగళవారం 14 జూలై 2020
International - Jun 23, 2020 , 16:09:44

త్రైపాక్షిక వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

త్రైపాక్షిక వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రష్యా, భారత్‌, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. గల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణ తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్‌ కే జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ముఖాముఖి జరుగుతున్నది. అయితే, ఈ సమావేశంలో ద్వైపాక్షిక విషయాల గురించి చర్చించబోమని రష్యా స్పష్టం చేసింది. జర్మనీలో నాజీలపై రష్యా విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అధ్యక్షత వహిస్తారు. 

ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక సమావేశం అంతర్జాతీయ సంబంధాలను సమీక్షించడమేనని, అయితే ఈ రోజు సవాలు అనేది భావన లేదా నియమాలు కావని, కేవలం దాని సమాన అభ్యాసం అని అన్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారి ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. దీనితోపాటు మూడు దేశాల విదేశాంగ మంత్రులు భద్రత, ఆర్థిక స్థిరత్వం, భద్రతకు సంబంధించిన సవాళ్లను చర్చించే అవకాశాలు ఉన్నాయి.

ఆరు రోజుల క్రితమే మాట్లాడుకొన్నారు

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఇంతలో ఈ సమావేశం మూడు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగింది. ఈ నెల 17నే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించుకొన్నారు. సరిహద్దులో దిగజారుతున్న పరిస్థితులతోపాటు సరిహద్దు వివాదంపై జైశంకర్, వాంగ్ యి ఫోన్‌లో చర్చించారు.


logo