సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 13:25:59

20 లాట‌రీ టికెట్లు కొంటే మొత్తం త‌గిలాయి.. అదృష్టం మామూలుగా లేదు!

20 లాట‌రీ టికెట్లు కొంటే మొత్తం త‌గిలాయి.. అదృష్టం మామూలుగా లేదు!

లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి చాలామంది ఉద్యోగాలు పోయి రోడ్డున ప‌డుతుంటే మ‌రికొంద‌రేమో లాట‌రీలు పుణ్య‌మా అంటూ కోటీశ్వ‌రులు అవుతున్నారు. టైంపాస్‌, అదృష్టాన్ని ప‌రీక్షించుకుందాం అని కొన్న టికెట్లు వారిని జ‌మిందారుల‌ను చేస్తుంది. ఇదివ‌ర‌కు ఓ వ్య‌క్తి బీచ్‌లో 25 లాట‌రీ టికెట్లు కొన్నాడు. ఒక‌టి కాక‌పోయినా మ‌రొక‌టి అయినా త‌గులుతుంది అనుకున్నాడు. వింత ఏంటంటే.. అత‌నికి 25 టికెట్ల లాట‌రీ గెలుచుకున్నాడు. ఈ విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది.

వర్జీనియా సౌత్బోస్టన్‌కి చెందిన టోనీమైల్స్‌ ఇంటిని అదృష్టం త‌లుపు త‌ట్టింది. అత‌ను టైం చాలా బాడ్‌గా ఉండేస‌రికి ఒక‌సారి అయినా మంచి జ‌రుగ‌దా అని 20 లాట‌రీలు కొనుగోలు చేశాడు. ఈసారి ల‌క్ష్మీదేవి అత‌నికి స్వాగ‌తం ప‌లికింది. కొన్న 20 లాట‌రీలు గెలుచుకున్నాడు. ఇది తెలుసుకున్న అత‌ను ఆనందంతోపాటు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాడు. అత‌ను ఒక్కో లాట‌రీ టికెట్‌ను 5 వేల డాలర్లు పెట్టి కొన్నాడు. కాగా ఫ‌లితంగా ల‌క్ష డాల‌ర్లు బ‌హుమ‌తిగా పొందాడు. అంటే సుమారు 73.24 ల‌క్ష‌లు గెలుచుకున్నాడు. ఈ డ‌బ్బుని వృథా చేయ‌కుండా త‌న‌కున్న అప్పులు తీర్చి, కుటుంబాన్ని బాగా చూసుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు టోనీమైల్స్‌. 

  


logo