మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 15:53:09

సింహాలు చెప్పిన మాట విన‌లేద‌ని చేతితో కొట్టాడు.. చివ‌రికీ!

సింహాలు చెప్పిన మాట విన‌లేద‌ని చేతితో కొట్టాడు.. చివ‌రికీ!

సింహాలు మ‌నిషి మాట విన‌డం ఏంటి. ద‌గ్గ‌ర‌కి వ‌స్తే మ‌నుషులే వాటి మాట వింటారు క‌దా. అస‌లు ఆ ప్ర‌శ్న ఏంటి అనుకుంటున్నారా?  దీని గురించి చెప్ప‌డం క‌న్నా వీడియో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. వీడియోలో క‌నిపిస్తున్నది కుక్క‌లు కాదు, సింహాలు. ఒక్కొక్క‌టి ఆక‌లితో ఎద‌రుచూస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఆరు సింహాలు క‌లిసి ఒక సింహంతో గొడ‌వ ప‌డుతున్నాయి. వాటి నుంచి ఈ సింహాన్ని కాపాడేందుకు ఓ వ్య‌క్తి ఆ సింహాల మ‌ధ్య‌కు వ‌చ్చాడు. ఆరు సింహాల‌ను త‌రిమికొట్టి దీనిని కాపాడాడు.

ఆ వ్య‌క్తి సింహాల‌ను కుక్క‌ను త‌రిమిన‌ట్లు చేతితో త‌రిమాడు. అవి అత‌న్నిఏమ‌నుకుండా స‌రేనంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయాయి. అశ్చ‌ర్యం. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. సింహాలు మ‌నుషుల మాట‌లు ఎప్ప‌టి నుంచి వింటున్నాయ‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇత‌నికి ఆ సింహాల‌కు ఏదో రిలేష‌న్ ఉండి ఉంటుంది. లేదంటే అత‌ని మాట విన‌డం ఏంట‌ని నెటిజ‌న్లు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఖ‌చ్చితంగా అవి అత‌ని పెంపుడు సింహాలు అయి ఉంటాయ‌ని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఏమాట‌కి ఆ మాట చెప్పుకోవాలి. ఒక ఆయుధం కూడా లేకుండా ఏడు సింహాల మ‌ధ్య అత‌ను తిర‌గ‌డం నిజంగా గ్రేట్‌!


logo