మంగళవారం 04 ఆగస్టు 2020
International - Jun 24, 2020 , 12:15:54

గుర్రం ముందు కూనిరాగాలు తీస్తున్న చిన్నారి!

గుర్రం ముందు కూనిరాగాలు తీస్తున్న చిన్నారి!

ఈ రోజు చాలా మూడీగా ఉన్న‌ట్ల‌యితే ఈ వీడియో చూస్తే అంతా మారిపోతుందంటున్నారు అమెరిక‌న్ మాజీ క్రికెట‌ర్ రెక్స్ చాప్మ‌న్‌. 45 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇది ప్ర‌తిఒక్క‌రినీ ఉత్సాహప‌రుస్తుంది. ఇందులో ఓ చిన్నారి గుర్రం ముందు కూర్చొని పాట పాడుతూ ఉంటుంది. అది వింటూ గుర్రం ప‌ర‌వ‌సించి పోతున్న‌ది. వీడియో బాగా చూసిన‌ట్ల‌యితే ప‌క్క‌నే చాలా ర‌కాల జంతువులు కూడా క‌నిపిస్తున్నాయి. వాటితో చిన్నారి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్న‌ది.

ఈ చిన్నారి పొలంలో ఉన్న వాహనంపై కూర్చొని గుర్రం నుదుటిపై అలా నిమురుతూ పాట పాడుతుంటే ఆహా ఎంత హాయిగా అనిపిస్తుంది. గుర్రం కూడా పాప‌ని బాగా చూసుకుంటున్న‌ది. 'ఈ చిన్నారి వీడియో చూస్తే మీ రోజుని ఎంతో ఆహ్లాద‌క‌రంగా మార్చుకోవ‌చ్చు' అనే శీర్షిక‌తో షేర్ చేశారు రెక్స్‌. వీడియో ఆన్‌లైన్‌లో షేర్ అయిన వెంట‌నే వైర‌ల్ అయింది. 588k కంటే ఎక్కువ మంది వీక్షించారు. 25 వేల‌కు పైగా లైక్స్ సంపాదించింది. 

 

 


logo