ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 12:00:05

ఈ ప‌క్షి డ్యాన్స్ చూశారా..

ఈ ప‌క్షి డ్యాన్స్ చూశారా..

అలార‌మ్ రింగ్‌టోన్ విన‌గానే ప్ర‌తిఒక్క‌రికీ చిరాకు వ‌స్తుంది. ఈ ప‌క్షికి మాత్రం మాంచి జోష్ వ‌స్తుంది. కావాలంటే మీరే చూడండి. ఒక్కో అలారం రింగ్‌టోన్ ప్లే చేస్తుంటే ట్యూన్‌కి త‌గిన‌ట్లుగా ప‌క్షి డ్యాన్స్ చేస్తున్న‌ది. 42 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

ఒక వ్య‌క్తి వారి ఫోన్‌లో అలారం రింగ్‌టోన్‌ల‌ను మారుస్తున్న‌ట్లు క్లిప్ మొద‌ల‌వుతుంది. 'వేర్వేరు అలారం రింగ్‌టోన్‌లకు ర‌క‌ర‌కాలుగా నృత్యాలు చేస్తున్న ఈ పక్షి ఖచ్చితంగా అంద‌రినీ అల‌రిస్తుంది' అనే శీర్షికతో క్లిప్‌ను షేర్ చేశారు. వీడియో పోస్ట్ చేసిన కాసేప‌టికే 369.8 కే మంది వీక్షించారు. కొంత‌మంది అయితే ఈ ప‌క్షి నా క‌న్నా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అని కామెంట్ పెట్ట‌గా, మ‌రొక‌రు ధ‌న్య‌వాదాలు అని కామెంట్లు పెడుతున్నారు.logo