గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 15, 2020 , 19:22:34

మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్న స్నేక్ స్పైడ‌ర్ వీడియో!

మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్న స్నేక్ స్పైడ‌ర్ వీడియో!

ఎవ‌రో చెప్పిన మాట‌లు కాదు క‌ళ్ల‌తో చూసి న‌మ్మాలి అంటుంటారు. కానీ ఈ దృశ్యం మాత్రం చూసినా న‌మ్మాల్సిన అవ‌స‌రం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఫోటో చూడ‌గానే ఈ జీవి పాములా క‌నిపిస్తుంది. లోప‌లికి వెళ్లి చూస్తే అది ఐదు కాళ్ల జీవి అని తెలిసింది. 31 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో ఈ జీవి అచ్చం సాలిపురుగులా క‌నిపిస్తున్న‌ది.

రాయి మీద పాకుతున్న‌ట్లు క‌నిపించే ఈ వింత జీవి ఇది వ‌ర‌కే సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. విభిన్నంగా ఉండ‌డంతో ఇంకా వైర‌ల్ అవుతూనే ఉంది. పాములా ఉన్న ఈ జీవి ఏంట‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోతున్నారు. దీనిని లేడియా ర్యాలే అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. దీనిని ఇప్ప‌టివ‌ర‌కు 298.8 కే మంది వీక్షించారు. దీనిని చూసిన కొంద‌ర‌యితే స్నేక్ స్పైడ‌ర్ అని పేరు పెట్టారు.


తాజావార్తలు


logo