గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 15:16:23

196 కిలోల భారీ గొరిల్లాకు కరోనా టెస్టులు.. పాజిటివ్ వ‌చ్చిందంటే ఇక అంతే!

196 కిలోల భారీ గొరిల్లాకు కరోనా టెస్టులు.. పాజిటివ్ వ‌చ్చిందంటే ఇక అంతే!

మ‌నిషి రూపంలో ఉండే గొరిల్లాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద ఆకారంలో భ‌యంక‌రంగా ఉంటుంది. అయితే వీటితో కొంత‌మంది ఫ్రెండ్‌షిప్ కూడా చేస్తారు. మ‌నుషుల‌తో ప్రేమ‌గా ఉండేవి కూడా ఇప్పుడు క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌రోనా జంతువుల‌కు కూడా వ‌స్తుంది అని తెలిసిందే క‌దా. అందుకే ఒక పెద్ద గొరిల్లాకు క‌రోనా టెస్టులు చేప‌ట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

మ‌నుషుల‌కి అయితే చాలా సులువుగా క‌రోనా టెస్ట్ చేసేస్తారు. మ‌రి జంతువుల‌కు అంటే.. అది కూడా 196 కిలోల భారీ గొరిల్లాకు అంటే చాలా క‌ష్ట‌మే. మాట విన‌దు కాబ‌ట్టి మత్తుమందు ఇచ్చి బెడ్ మీద ప‌డుకోబెట్టి శాంపిళ్లు సేక‌రించారు. ఈ గొరిల్లా పేరు షాగో. మియామీ డెడే జులాజికల్ పార్క్ అండ్ గార్డెన్స్‌లో నివ‌సిస్తున్న‌ది. ఈ మ‌ధ్య మ‌రొక గొరిల్లాతో గొడ‌వ ప‌డి గాయాల‌పాలైంది. దీనికి చికిత్స చేసే ప్రాసెస్‌లో కొవిడ్‌-19 టెస్టులు కూడా చేశారు. షాగోకి నెగ‌టివ్ రావ‌డంతో అక్క‌డున్న డాక్ట‌ర్లు ఊపిరి పీల్చుకున్నారు.
logo