మరింత ఆలస్యం కానున్న విజయ్ మాల్యా అప్పగింత

న్యూఢిల్లీ : బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడంలో మరింత ఆలస్యం కానున్నదని తెలుస్తున్నది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా.. ఆశ్రయం కోసం ఆ దేశానికి దరఖాస్తు చేసుకున్నందున అప్పగింతపై దాదాపు ఆశలు వదులుకోవాల్సి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు మరిన్ని సంవత్సరాలుపాటు కొనసాగనున్నట్తు తెలుస్తున్నది. విజయ్ మాల్యాలను అప్పగించేందుకు ఈ ఏడాది మే నెల నాటికి అన్ని చట్టపరమైన ఎంపికలు పూర్తయిపోవడంతో మాల్యాను అప్పగించడం ఆలస్యం అవుతుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూకేలోని భారత హైకమిషనర్‌కు భారత హోం శాఖ కార్యదర్శ లేఖ రాశారు.
విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మరోసారి బ్రిటన్ హైకోర్టు తలుపు తట్టింది. మాల్యా కేసుకు సంబంధించి బ్యాంకుల వద్ద సెక్యూరిటీలుగా ఉన్న ఆస్తులను రుణాలకు బదులుగా స్వాధీనం చేసుకునేందుకు అవకా శం ఇవ్వాలని కోరింది. అయితే, బ్యాంకులిచ్చిన రుణాలు మొత్తం ప్రజల సొమ్ము అని, సెక్యూరిటీలను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులకు ఎటువంటి అధికారం లేదని మాల్యా తరపు న్యాయవాది వాదించారు. చీఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీస్ కోర్ట్ (ఐసీసీ) జడ్జ్ మైకల్ బ్రిగ్స్ ముందు వర్చువల్‌గా ఈ కేసు హియరింగ్ జరిగింది.
ఇలాఉండగా, బ్రిటన్ శరణు కోరిన విజయ్ మాల్యా తన ఆశ్రయం పొందేందుకు కావాల్సిన కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తున్నాడని, యూకే అతనికి మంచి రాజకీయ ప్రోత్సాహం ఉన్నదని సూచించినట్లు పలు వర్గాలు తెలిపాయి. ఆశ్రయం అనేది రాజకీయ వివాదం యొక్క పూర్తిగా విచక్షణతో ముందుకు సాగడం, కోర్టులతో ఎటువంటి సంబంధం ఉండదు. మాల్యా అభ్యర్ధన తిరస్కరించినపక్షంలో వివిధ స్థాయిల్లో విజ్ఞప్తులు తీసుకువస్తూ ఏండ్ల తరబడి నడిచేలా చేయడం అప్పగించడానికి ఆలస్యం కావడానికి మరో కారణమని తేలింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
- తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ
- నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్
- రిపబ్లిక్ డే వేడుకలకు వారికి అనుమతి లేదు..
- ఆయిల్ పామ్ సాగుకు మరింత ప్రోత్సాహం : మంత్రి నిరంజన్‌రెడ్డి
- ఆస్ట్రేలియాలో క్వారెంటైన్.. టెన్షన్లో టెన్నిస్ ప్లేయర్లు
- 50 ఏళ్ల గవాస్కర్ రికార్డును బద్ధలు కొట్టిన శుభ్‌మన్ గిల్