సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 26, 2020 , 12:18:48

జుట్టు క‌త్తిరిస్తే అత‌ను చ‌నిపోయిన‌ట్లే.. 5 మీ. పొడ‌వైన జుట్టుతో వృద్దుడు!

జుట్టు క‌త్తిరిస్తే అత‌ను చ‌నిపోయిన‌ట్లే.. 5 మీ. పొడ‌వైన జుట్టుతో వృద్దుడు!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో సెలూన్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. చాలామంది పురుషులు తమ జుట్టును క‌త్తిరించుకోవ‌డానికి సొంతంగా హెయిర్ క‌ట్ చేసుకున్నారు. 3 నెలలు హెయిర్ క‌ట్ చేయ‌క‌పోతేనే అంత జుట్టు పెరిగిపోతే.. వియ‌త్నాంకు చెందిన 92 ఏండ్ల న్గుయెన్ వాన్ చియెన్ గ‌త 82 ఏండ్లుగా జుట్టు క‌త్తిరించ‌కుండా పెంచుకుంటున్నాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అత‌నికి 5 మీ. పొడ‌వు జుట్టు పెరిగింది. ఆ జుట్టును గ‌నుక క‌త్తిరిస్తే అత‌ను చ‌నిపోయిన‌ట్లుగా భావిస్తాడు. దానిలోనే ఇత‌ని ప్రాణం దాగున్న‌ట్లు చెప్పుకొచ్చాడు.


చియెన్ మూడ‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు జుట్టును క‌త్తిరించేవాడు. త‌ర్వాత ఇంకెప్పుడు హెయిర్ క‌ట్ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు జుట్టు దువ్వ‌డం గాని, త‌ల‌స్నానం చేపించ‌డం కాని చేసేది లేదు. పొడ‌వు జుట్టుకు ఆరెంజ్ క‌ల‌ర్ త‌ల‌పాగా చుట్టి క‌వ‌ర్ చేస్తాడు. చిన్న‌ప్పుడు హెయిర్ న‌ల్ల‌గా, మందంగా, బ‌లంగా ఉండేద‌ని అత‌నికి జ్ఙాప‌కం. అత‌ను కొబ్బ‌రికాయ‌ల మీద మాత్ర‌మే జీవించాడ‌ని పేర్కొన్నాడు. కొంచెం పొడ‌వుంటే దానిని మ్యానేజ్ చేయ‌డానికి అల్లాడిపోతున్న ఈ రోజుల్లో అంత వ‌య‌సులో కూడా పొడ‌వైన జుట్టును జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్నాడంటే వృద్దుడిని మెచ్చుకోవాల్సిందే. 


logo